టిఫిన్‌ బాక్సు ఎందుకు పోగొట్టావ్‌? 

school student suicide - Sakshi

తల్లి మందలించినందుకు బాలుడి ఆత్మహత్య  

చారకొండ: టిఫిన్‌ బాక్స్, బ్యాగులను ఎందుకు పోగొట్టావని తల్లి మందలించినందుకు ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి తంగెళ్ల అనిల్‌ (14) స్థానిక విశ్వశాంతి పబ్లిక్‌ స్కూలులో 8వ తరగతి చదువుతున్నాడు.

శనివారం టిఫిన్‌ బాక్స్, బ్యాగు పోగొట్టాడు. ఇది తెలుసుకున్న తల్లి యాదమ్మ మందలించింది. తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్‌.. ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబ సభ్యులతో పాటు నిద్రించాడు.

అర్ధరాత్రి తర్వాత అనిల్‌ లేచి కిరోసిన్‌ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారొచ్చి మంటలార్పేలోపు అనిల్‌ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసే అనిల్‌ తండ్రి యాదయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అనిల్‌ ఆత్మహత్యతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top