వేధింపులు తాళలేకే..

Sathish Statement On His Suicide Attempt Infront Of Police Station - Sakshi

బంజారాహిల్స్‌: చెప్పకుండా పుట్టింటికి వచ్చిన తన భార్యను కాపురానికి పంపకపోగా, అత్తింటి వారు తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టడం, తన భార్య బహిరంగంగా కాలర్‌ పట్టుకుని ఆవమానించినందునే మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు సతీష్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం మధ్యాహ్నం తనను, తన కుటుంబాన్ని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచారని ఆగ్రహం పట్టలేక ఒంటిపై పెట్రోల్‌పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్‌ కుమార్‌ ప్రస్తుతం డీఆర్‌డీల్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మామ మనోజ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. కాగా సతీష్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top