వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Road Accidents In Karimnagar - Sakshi

జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం జేఎన్టీయూ క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద వ్యాను ఢీకొని చింతలతాడెం రాయమల్లు(45) దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన పుల్లెల సుమన్‌(28) మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేటకు చెందిన వేల్పుల నడ్పిలింబన్న(72) విద్యుత్‌షాక్‌తో చనిపోయాడు.

మల్లాపూర్‌(కోరుట్ల): మల్లాపూర్‌ మండలం మొగిలిపేట శివారులోని పిల్లిగుట్ట సమీపంలో మొక్కజొన్న చేలో విద్యుదాఘాతంతో రైతు వేల్పుల నడ్పిలింబన్న(72) మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నడ్పి లింబయ్య గ్రామ శివారులో తనకున్న రెండెకరాల వ్యవసాయభూమిలో వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. మొక్కజొన్న కంకులను కోతులు, పక్షుల నుంచి కాపాడుకోవడానికి రోజూ చేలోకి వెళ్తాడు. మంగళవారం వేకువజామున కూడా వెళ్లాడు. కాగా రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో చేలు శివారులో విద్యుత్‌స్తంభం నేలకూలింది. దాన్ని గమనించని నడ్పిలింబన్న దాటేక్రమంలో షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై పృథ్వీరాజ్, ట్రాన్స్‌కో ఏఈ రఘుపతి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  

రోడ్డు ప్రమాదంలో ఒకరు.. 
కొడిమ్యాల(చొప్పదండి): కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను ఢీకొట్టడంతో మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన చింతలతాడెం రాయమల్లు(45) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాయమల్లు కొడిమ్యాల మండలం పూడూరులోని చార్‌బాయి బీడీకంపెనీలో బైండింగ్‌వర్క్‌ చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం తన ద్విచక్రవాహనంపై ముత్యంపేట నుండి పూడూరుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న సరుకురవాణా వ్యాను ఢీకొట్టింది. రాయమల్లుకు కాలు, చెయ్యి విరగడంతోపాటు ఛాతీలో తీవ్రగాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్‌ పరారీలోఉన్నాడు. మృతుడి భార్య రాధ ఫిర్యాదుతో ఎస్సై సోమ సతీశ్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top