ప్రాణంతీసిన అతివేగం

Road Accident In Mancherial Mahabubnagar - Sakshi

మంచిర్యాలక్రైం: వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాకేంద్రంలోని మేదరివాడ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు...బెల్లంపల్లికి చెందిన కొండ విజయలక్ష్మి (60) ఆమె భర్త బానయ్య, మనవడు మిథీల్, మందమర్రి మండలం బీజోన్‌కు చెందిన సలు వాది అనుసూర్య(45)లు కలిసి టీఎస్‌ 08యుడీ 1692 నంబర్‌ గల షిఫ్ట్‌కారులో డ్రైవర్‌ సాయిచరణ్‌లు హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి తిరిగి వస్తున్నారు. వెల్గటూర్‌ వద్ద సాయిచరణ్‌కు బామ్మర్ది వరుస అయిన దాదే రాకేశ్‌ను కారులో వెంట తీసుకువస్తున్నారు. డ్రైవింగ్‌ చేస్తా నని రాకేశ్‌ పట్టుబట ్టడంతో అప్పగించాడు.

కొంతదూరం వరకు బాగానే డ్రైవింగ్‌ చేసిన రాకేశ్‌ లక్షేటిపేట దాటినప్పటి నుంచి అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ ఎంత చెప్పినా వినకుండా ఆజాగ్రత్తగా నడిపాడు. దీంతో మంచిర్యాల పట్టణంలోని మేదరి వాడ వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి చెట్టుకు ఒక్కసారిగా బలంగా ఢీకొంది. కారులోని విజయలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందగా, అనుసూర్యకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుం డగా మార్గమధ్యలో మృతి చెందింది. కారు డ్రైవిం గ్‌ చేస్తున్న రాకేశ్‌కు స్వల్ప గాయాలు కావడంతో పరారీలో ఉన్నాడు. కారులోని బానయ్య, కారు డ్రైవర్‌ సాయిచరణ్, మిథి ల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై మారుతి తెలిపారు.

బీమా డబ్బుకోసం వెళ్లి.. 
విజయలక్ష్మి కుమారుడు అన్వేశ్‌తో అనసూర్య కూతురు ప్రజ్ఞారాణికి 2008 ఏప్రిల్‌ 8న వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు మీథిల్‌ పదేళ్ల బా బు ఉన్నాడు. సోమగూడెం పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్‌ 2015 నవంబర్‌ 2న విధి నిర్వహణలో మృతిచెందాడు. పోలీస్‌ శాఖనుంచి అన్వేష్‌ కుటుంబానికి బీమారావాల్సిఉంది. ఇది ఆలస్యంకావడంతో డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసేందుకు అన్వేశ్‌ తల్లి విజయలక్ష్మి, ప్రజ్ఞారాణి తల్లి అనసూర్య వెళ్లారు.
 
అయిన వాళ్లందరూ రోడ్డు ప్రమాదానికి బలి
ప్రజ్ఞారాణికి చెందిన వారందరూ రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందడం పలువురిని కంట తడిపెట్టించింది. ప్రజ్ఞారాణి తండ్రి శ్రీనివాస్, తల్లి అనసూర్య, భర్త అన్వేష్, అత్తమ్మ విజయలక్ష్మి పలు ప్రమాదాల్లో మృతిచెందారు. విజయలక్ష్మి అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది.

సీట్‌ బెల్ట్‌ ధరించి ఉంటే బతికుండేదేమో...
ప్రమాదాన్ని పరిశీలిస్తే ముందు సీట్లో కూర్చున్న విజయలక్ష్మి సీట్‌ బెల్ట్‌ ధరించి లేదని తెలుస్తోంది. తీవ్రగాయలైనప్పటికి సీటుబెల్ట్‌ పెట్టుకుంటే బతికి బయట పడేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు అతి వేగంగా చెట్టును ఢీకొట్టడంతో ముందు డోరు తెరుచుకుంది. విజయలక్ష్మి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైనట్లు కనిపిస్తోంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top