వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident At Inavolu Mandal Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులో బైక్‌, చెట్టును ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వర్ధన్నపేట నుంచి వరంగల్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను వర్దన్నపేట మండలానికి చెందిన గొడిశాల రామ్‌సాయి(20), మామిండ్ల ఆదిత్య(20), మురళీలుగా గుర్తించారు. రామ్‌సాయి, ఆదిత్యలు ఘటన స్థలంలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ మురళీ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమదానికి కారణంగా తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top