యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే బేరం పెట్టి..

Rajasthan Man Black Mails Women Who Chats Live With Him - Sakshi

ముంబై : యువతికి చెందిన నగ్న వీడియోను బయటపెడతానంటూ ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. వీడియోను రూ. 5వేలకు అమ్ముతానంటూ ఆమె స్నేహితుల వద్దే బేరంపెట్టాడు. ఈ సంఘటన ముంబైలోని పావయ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌కు చెందిన జితెన్‌ తన్సుఖానీకి అనే యువకుడికి గత నెల ఆగస్టులో ఓ 24ఏళ్ల యువతితో సోషల్‌ మీడియాలో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరుచూ వీడియో కాలింగ్‌లో మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఓ రోజు వీడియో చాటింగ్‌ చేస్తున్న సమయంలో యువతిని దుస్తులు తొలగించవల్సిందిగా అతడు కోరాడు. ఆమె అతడు చెప్పినట్లుగానే చేసింది.

అయితే జితెన్‌ ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. కొద్దిరోజులు తర్వాత యువతి మిత్రులతో ఆమెకు సంబంధించిన నగ్న వీడియో తన వద్ద ఉందని, వీడియోను రూ.5వేలకు అమ్ముతానని బేరమాడాడు. అయితే సదరు యువతి స్నేహితులు ఆమెకు జితెన్‌ నిర్వాకంపై సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె అతన్ని ఈ విషయంపై ప్రశ్నించగా.. నిజమేనని ఒప్పుకున్నాడు. తనకు రూ. 70వేలు చెల్లిస్తే వీడియోను డిలేట్‌ చేస్తానని, లేదంటే సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించి జితెన్‌పై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెప్టెంబర్‌ 13న జితెన్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి : ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top