చిత్తూరులో విషాదం..

Pregnant woman committed suicide with children - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఓ నిండు గర్భిణీ, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొంది. చిత్తూరు రూరల్ మండలంలోని పెయిన కండ్రికకు చెందిన గురునాథానికి 2012లో సరళతో వివాహమైంది. వారికి జోత్స్నా, దేవిశ్రీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సరళ ఆరు నెలల గర్భవతి. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం, ఇప్పుడు పుట్టబోయే శిశువు కూడా ఆడపిల్ల అని స్కానింగ్‌లో తెలియడంతో భర్త, అత్తమామలు సరళను కొద్దికాలంగా తీవ్రంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక సరళ తెల్లవారుజామున పిల్లలతోపాటు గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య పాల్పడింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సరళ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతూ విలపిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top