కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Police Constable Committed Suicide In CM KCR Farm House In Gajwel - Sakshi

సాక్షి, సిద్దిపేట : గజ్వెల్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఫాంహౌజ్‌లో వెంకటేశ్వర్లు హెడ్‌గార్డ్‌గా విధుల్లో ఉన్నట్టు తెలిసింది.

మద్యం మత్తులోనే ఘోరం..
మద్యం మత్తులోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ అనుమానం వ్యక్తం చేశారు. అతను గత కొంతకాలంగా విధులకు సరిగా హాజరుకావడం లేదని తెలిపారు. వెంకటేశ్వర్లు భార్య విఙ్ఞప్తితో తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకున్నట్టు చెప్పారు. మృతుని స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని చాడ గ్రామం అని తెలిపారు. కేవలం వ్యక్తిగత సమస్యల కారణంగా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని సిద్దిపేట సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

గతంలో ఓ సారి సస్పెండ్‌ అయ్యాడు..
పోలీస్‌శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం..  2003 బ్యాచ్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు స్వస్థలం వలిగొండ. గతంలో ఓ మహిళను వేధింపులకు గురిచేసిన కారణంగా ఏడాదిన్నరపాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో అతనిపై పలు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర్లుకు భార్య శోభ (30), ఇద్దరు పిల్లలు వెన్నెల (13), చందు (12) ఉన్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఇటీవల పోలీస్‌ శాఖ స్వయంగా ఓ వాహనంలో అతన్ని స్వస్థలానికి చేర్చింది. అక్కడ రెండు రోజులు గడిపిన అనంతరం..  తిరిగి అక్టోబర్‌ 1న కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో విధుల్లో చేరాడు. మృతుని భార్య శోభ కూరగాయల వ్యాపారం చేస్తుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top