అత్తగారింటికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

Persons Died With Road Accident In Adilabad - Sakshi

బస్సు ఢీకొని ఇద్దరి మృతి 

మృతులిద్దరూ అన్నదమ్ములు

సాక్షి, ఉట్నూర్‌: ఆ యువకుడికి రెండునెలల క్రితమై వివాహమైంది. పెళ్లయ్యాక వచ్చిన తొలి ఏకాదశి కావడంతో పండుగ నిమిత్తం అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తూ అనంతలోకాలకు చేరాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం లక్కారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన బొడ్డు నరేశ్‌ (25)కు జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన అమ్మాయితో రెండు నెలల క్రితం వివాహమైంది. తొలి ఏకాదశికి అత్తాగారింటి నుంచి పిలుపు రావడంతో తన చిన్నమ్మ కుమారుడు పులిశెట్టి లక్ష్మణ్‌(18)ని వెంటబెట్టుకుని ద్విచక్రవాహనంపై జగిత్యాలకు వెళ్లాడు. అక్కడ ఆనందంగా గడిపాడు. శనివారం భార్యతోపాటు ఇంటికి బయల్దేరాడు.

తమ్ముడు ఉండడంతో భార్యను బస్సు ఎక్కించి.. తమ్ముడితోపాటు తాను ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. మండలంలోని బీర్సాయిపేట సమీపంలోని గండి వద్దకు చేరుకోగానే.. ఆదిలాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తూ వీరిని ఢీకొంది. ఈ సంఘటనలో లక్ష్మణ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. నరేశ్‌ తీవ్రంగా గాయపడగా.. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ నరేశ్‌ కూడా చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top