ఆనందం అంతలోనే ఆవిరైంది.. | A Person Killed In A Auto Bike Dash In Nizamabad | Sakshi
Sakshi News home page

ఆనందం అంతలోనే ఆవిరైంది..

Published Mon, Mar 18 2019 3:27 PM | Last Updated on Fri, Jul 23 2021 8:05 PM

A Person Killed In A Auto Bike Dash In Nizamabad

సాక్షి, మాచారెడ్డి: తన మిత్రులతో ఆనందంగా గడిపిన ఓ యువకుడు ఎక్కువ సేపు ఆగలేదు. రోడ్డు ప్రమాదం రూరంలో ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిశాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పాల్వంచ బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఆటో, బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కాగా ఓ యువకుడి పరిస్థితి విషమం కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సేపటికే మరణించాడు.

రాజన్నసిరిసిల్లా గంభీరావుపేటకు చెందిన ప్యాసింజర్‌ ఆటో కామారెడ్డి నుంచి గంభీరావుపేట వైపు వెళ్తుంది. అందులో చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు వజ్రమ్మ, లక్ష్మి, అరుణ, పోతారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు మాచారెడ్డి వైపు వస్తున్నారు. పాల్వంచ గ్రామానికి చెందిన హరీష్‌(20) అనే యువకుడు తనమిత్రులతోకలిసి చుక్కాపూర్‌లక్ష్మీనర్సింహాస్వామిదర్శించుకున్నాడు.అక్కడే పూర్వవిద్యార్థుల సమ్మేళనం చేసుకున్నారు. పాల్వంచ గ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. హరీష్‌ తలకు, కాళ్లకు, చేతులకు తీ వ్రగాయాలు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్ష త్రగాత్రులను ముందుగా కామారెడ్డి ఏరియా ఆస్పత్రి తరలించారు. హరీష్‌ పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్సలు నిర్వహించి హైదరాబాద్‌కు తరలించినట్లు స్థానికులు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement