ఆఫర్ రిజెక్ట్ చేసిందని.. నటి దారుణ హత్య

Pakistan actress Sumbul Killed due to rejecting offer - Sakshi

కరాచీ: పాకిస్తాన్ నటి, స్టేజ్‌ ఆర్టిస్ట్ సంబుల్ దారుణహత్యకు గురయ్యారు. ఓ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చేందుకు అంగీకరించక పోవడంతో ఆగ్రహం తెచ్చుకున్న కొందరు వ్యక్తులు శనివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నటి పరిస్థితిని గమనించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా సంబుల్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

కైబర్ కనుమల సమీపంలోని మర్దాన్ నగరంలో జరిగిన నటి హత్య స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని,  కాగా ఓ నిందితుడు పోలీస్ శాఖ మాజీ ఉద్యోగి నయీమ్‌గా గుర్తించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాట పాడుతూ డ్యాన్స్ చేసి ప్రదర్శన ఇవ్వాలని ఇటీవల నటి సంబుల్‌కు ఆఫర్ రాగా, ఆమె తిరస్కరించారు. మా ఈవెంట్‌లో ఆడి పాడేందుకు నిరాకరిస్తావా అంటూ ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడి నిందితులు నటిని హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top