కారు బీభత్సం : రెండుకు చేరిన మృతుల సంఖ్య

One More Killed In Bowenpally Road Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి డైరీ ఫామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  నాగమణి అనే మహిళ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై బోయిన్‌పల్లి సీఐ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆదివారం  ఓ మైనర్‌ బాలుడు మారుతి వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టాడు. బోయిన్‌పల్లిలో డైరీ ఫామ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినపుడు ఆటోలో ఇద్దరు కవల పిల్లలతో పాటు నాగమణి, సంధ్య అనే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిన్న ప్రమాద స్థలంలోనే  14 నెలల పిల్లాడు మృతి చెందాడు.

అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ పిల్లాడి నాన్నమ్మ నాగమణి కూడా మృతి చెందింది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తాం. వారి తల్లిదండ్రులకు కూడా కౌన్స్‌లింగ్ ఇస్తాం. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పదే పదే చెబుతున్నాం. మార్పు రావడం లేదు, మైనర్ ర్యాస్‌ డ్రైవింగ్‌ కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయ’’ని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top