అందువల్లే నా తమ్ముడి ఆత్మహత్య

MY Brother Committed Suicide Due to Harrassment, Says Software Employee Brother   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్తింటివారితో పాటు కట్టుకున్న భార్య వేధింపుల వల్లే  తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుమంత్‌రెడ్డి సోదరుడు శ్రావణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో సమంత్‌రెడ్డి అనే సాఫ్‌వేర్‌ ఉద్యోగి నిన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నంకు చెందిన యువతితో సమంత్‌రెడ్డికి వివాహమైంది. పెళ్లయిన నాలుగు నెలలకే సుమంత్‌రెడ్డి ఆత్మహత్యచేసుకున్నాడు. భార్య, అత్తింటివారి టార్చర్‌ భరించలేకే  ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌నోట్‌ కూడా రాశాడు.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపధ్యంలో తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుమంత్‌రెడ్డి సోదరుడు శ్రావణ్‌..  రాజేంద్రనగర్‌ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top