యువకుడి హత్య..

Murder Case Revelas in Vizianagaram - Sakshi

ఆలస్యంగా వెలుగులోకి..

నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే చంపేశా : నిందితుడు

విజయనగరం, సాలూరు రూరల్‌: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమనంతోనే వరుసకు తమ్ముడైన వ్యక్తిని హత్య చేసిన సంఘటన పాచిపెంట మండలంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం స్థానిక సీఐ కార్యాలయంలో పాచిపెంట  ఎస్సై సన్యాసినాయుడుతో కలిసి సీఐ ఇలియాస్‌ మహ్మద్‌  తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.  పాచిపెంట పంచాయతీ  కూనంబందవలస గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య ఇటీవల హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చొక్కాపు కన్నయ్య భార్యతో బోదయ్యకు వివాహేతర సంబంధం ఉందని నిందితుడు కన్నయ్యకు అనుమానం ఉంది. బోదయ్య పని కోసం ఏలూరు వెళ్లిపోయినా ఇటీవల పండుగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు.

ఈ క్రమంలో  బోదయ్య ఈ నెల 8వ తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాచిపెంట వెళ్లి తిరుగుముఖం పట్టాడు. సరిగ్గా తోటవలస గ్రామం దాటిన తర్వాత షావుకారి తోట సమీపంలో బోదయ్యను ఆపి తన భార్యతో వివాహేతర సంబంధం మానవా అంటూ నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. అప్పటికే తనతో తెచ్చుకున్న రాడ్డుతో కన్నయ్య బోదయ్యపై దాడి చేశాడు. దీంతో బోదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నయ్య ఏమి తెలియనట్లుగా గ్రామానికి వెళ్లిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా ఎస్సై సన్యాసినాయుడు గ్రామానికి వెళ్లి డాగ్‌ స్క్వాడ్‌ తీసుకువస్తామని.. నిందితుడు తప్పకుండా దొరికిపోతాడని  చెప్పడంతో భయపడిన కన్నయ్య ఆదివారం స్థానిక వీఆర్‌ఓ వద్దకు వెళ్లి నిజం ఒప్పుకున్నాడు. వీఆర్‌ఓ  ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడ్ని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top