వివాహేతర సంబంధం వద్దన్నందుకు కడతేర్చారు

Murder Case Reveals in Tamil nadu - Sakshi

టీ.నగర్‌: కోడలుతో వివాహేతర సంబంధాన్ని వద్దన్నందుకు  ఆమె ప్రియుడి చేతిలో మామ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి జిల్లా, కయత్తారు సమీపంలోగల మేలపారైపట్టికి చెందిన అన్నాదురై (55) రైతు. ఇతని భార్య అనంతమ్మాళ్‌ (50). వీరి కుమారుడు హరికృష్ణన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. ఇతని భార్య ప్రేమలత. వివాహం జరిగిన వెంటనే హరికృష్ణన్‌ దుబాయ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రేమలతకు సమీపంలోగల ముమ్మలైపట్టికి చెందిన ముత్తుమారియప్పన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అన్నాదురై కోడలు ప్రేమలతను మందలించాడు. దీంతో ఆమె ముత్తుమారియప్పన్‌ను కలవడం మానేసింది.

దీంతో అన్నాదురైపై ఆగ్రహించిన ముత్తుమారియప్పన్‌ అతనితో గొడవకు దిగాడు. దీనిపై కడంబూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణ జరిపి ముత్తుమారియప్పన్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆతను బెయిల్‌పై విడుదలయ్యాడు. వివాహేతర సంబం«ధానికి అడ్డుగా ఉన్న అన్నాదురైను హతమార్చేందుకు నిర్ణయించాడు. సోమవారం రాత్రి అన్నాదురై ఇంటికి వెళ్లిన ముత్తుమారియప్పన్‌ అతని అనుచరులు అన్నాదురైపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. పోలీసులు సంఘటన స్థలం చేరుకుని అన్నాదురై మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి ముత్తుమారియప్పన్, బాలసుబ్రమణ్యన్, కరుప్పసామిలను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top