పుట్టినరోజే యువతిపై సామూహిక అత్యాచారం

Mumbai Woman Allegedly Raped By 4 Men On Her Birthday - Sakshi

అది జూలై 7వ తేదీ. ముంబైలో 19 సంవత్సరాల అమ్మాయి తన పుట్టిన రోజు సందర్భంగా అందంగా ముస్తాబైంది. వేడుకల కోసమని మిత్రురాలి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడికి బయల్దేరినపుడు సంతోషంగా ఉన్న ఆమె.. పూర్తి దిగాలుగా ఇంటికి చేరుకుంది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా మౌనమే ఆమె సమాధానమయ్యింది. ఈ క్రమంలో తనను బలవంతపెట్టడం ఇష్టంలేక వారు కూడా విషయమేమిటని తనను విసిగించలేదు. అయితే కొన్నిరోజులుగా ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒంటరిగా ఉండటం, వెక్కివెక్కి ఏడ్వటం, మానసికంగా కుంగిపోవటంతో ఆరోగ్య పరిస్థితి దిగజారింది.

ఈ క్రమంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షల అనంతరం తనపై అత్యాచారం జరిగిందని వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందని ప్రశ్నించగా పుట్టిన రోజు జరిగిన దారుణాన్ని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. బర్త్‌డే రోజున స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వచ్చే సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెపై అమానుషంగా దాడి చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top