తల్లి, కొడుకుల హత్యా: కత్తితో పోడిచిన దుండుగులు

Mother And Son Found Stabbed To Death At Home In Delhi - Sakshi

న్యూఢిల్లీ:  ఓ మహిళాతోపాటు తన 12 ఏళ్ల కుమారుడిని దుండగులు హత్య చేసిన ఘటన ఢిల్లీలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నార్త్‌ఈస్ట్‌లోని జహంగీర్‌పూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో పూజా(36) అనే మహిళ నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే ఆమె భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షిత్‌(12)తో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం వారి ఫ్లాటు నుంచి దుర్వాసన రావండంతో అపార్టుమెంటు వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులను తెరిచి చూడగా వారిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే వీరిద్దరూ చనిపోవడానికి ముందే పదునైనా ఆయుధంతో ఓళ్లంతా గాట్లు పెట్టి ఆపై కత్తితో పోడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాక రెండు, మూడు మూడు రోజులకు ముందే వీరు హత్యకు గురైనట్లు చెప్పారు. 

ఇక  ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కమిషనర్‌ విజయాంత ఆర్య తెలిపారు. అలాగే మృతురాలి ఇంటికి మూడు రోజుల నుంచి ఎవరెవరు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనపై మృతురాలి తల్లి మాట్లాడుతూ.. తనకు ఈ విషయం అపార్టుమెంటు వాసులు సమాచారం ఇవ్వడంతో తెలిసిందని అన్నారు. అనంతరం తనకు ఎవరిపైన అయిన అనుమానం ఉందా అని పోలీసులు ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి ఆమె నిరాకరించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం​ ఆసుపత్రికి తరలించినట్లు కమిషనర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top