మినీబస్సు దూసుకెళ్లి తల్లి, కుమార్తె దుర్మరణం

Mother And Daugter Died in Bus Accident Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: మినీబస్సు దూసుకెళ్లి తల్లి, కుమార్తె మృతిచెందిన సంఘటన నాగర్‌కోవిల్‌ సమీపంలో బుధవారం జరిగింది. నాగర్‌కోవిల్‌ సమీపం మేలశంకరన్‌కురి శాంతపురానికి చెందిన నాగకృష్ణన్‌ (49) నాగర్‌కోవిల్‌ రాణితోట ప్రభుత్వ రవాణశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతని భార్య సుధ (42). వీరి కుమార్తె శ్రీపద్మప్రియ (16) 10వ తరగతి ఉత్తీర్ణురాలైంది. కుమార్తెని ప్లస్‌ఒన్‌లో చేర్చడానికి దంపతులు బుధవారం నాగర్‌కోవిల్‌లోని ఓ పాఠశాలకి బైకుపై వెళ్లారు. అక్కడ పాఠశాలలో చేర్చి మధ్యాహ్నం అదే బైకుపై తిరిగి వస్తున్నారు. కేబ్‌ రోడ్డులో వస్తుండగా రోడ్డుపక్కన నిలిపిన కారు డ్రైవర్‌ హఠాత్తుగా డోర్‌ తెరిచా డు. ఇది గమనించని నాగకృష్ణన్‌ కారు డోర్‌ను వేగంగా ఢీకొన్నాడు. శ్రీపద్మప్రియ, సుధా రోడ్డుపై పడడంతో మినీ బస్సు వారిపై దూసుకెళ్లింది. ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. నాగకృష్ణన్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top