మైనర్‌ బాలికపై లైంగిక దాడి

Molestation Of Minor In Jagadgiri Gutta Hyderabad - Sakshi

జగద్గిరిగుట్ట: వినాయక లడ్డూ ఇస్తానని చెప్పి, ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్టలో కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ణి రిమాండ్‌కు పంపారు.  జగద్గిరిగుట్ట సీఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం... జగద్గిరిగుట్టకు చెందిన వడ్డెమని శ్రీనివాస్‌ (37) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 30న జగద్గిరిగుట్టలో నివాసముండే తన బంధువులైన సతీష్‌ ఇంటికి వెళ్లాడు. వినాయక లడ్డూ ఇస్తానని సతీష్‌ కుమార్తె (11), చిన్న కుమారుడిని శ్రీనివాస్‌ తన ఇంటికి తీసుకెళ్లాడు. సతీష్‌ కుమారుడికి డబ్బులిచ్చి చాక్లెట్‌ కొనుక్కొమని దుకాణానికి పంపాడు. అనంతరం మైనర్‌ బాలికకు పోర్న్‌ వీడియోలు (అశ్లీల చిత్రాలు) చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అదే సమయంలో శ్రీనివాస్‌ భార్య ఇంటికి రావడంతో సంఘటన చూసింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో శ్రీనివాస్‌ పరారయ్యాడు. అదే రోజు బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top