మద్యం సేవించి సెల్ఫీలు దిగి ఆపై ప్రేమజంట..

Married Woman Her Lover Allegedly Shot Themselves - Sakshi

జైపూర్‌ : ప్రేమ విఫలమైందనే బాధతో ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికులిద్దరూ నాటుతుపాకితో కాల్చుకుని తనువు చాలించిన ఘటన రాజస్ధాన్‌లోని బార్మర్‌ జిల్లాలో వెలుగుచూసింది. వివాహం కాక ముందు నుంచి అంజు సుతార్‌, శంకార్‌ చౌదురిలు సహజీవనం సాగించారని, అంజూ సుతార్‌కు వివాహమైన తర్వాత తాము ఇక కలిసి ఉండలేమని వారు నిర్ధారణకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ప్రేమ​ విఫలమైనందునే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని వారి మొబైల్‌ ఫోన్‌లో ఆడియో క్లిప్‌లో రికార్డు చేశారు. వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడే ముందు మద్యం సేవించి, సెల్ఫీలు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా ప్రదేశంలో రెండు నాటు తుపాకీలు లభ్యమయ్యాయని వీరికి ఇవి ఎక్కడ లభ్యమయ్యాయనేది విచారిస్తామని బార్మర్‌ ఎస్పీ రషి దోగ్రా తెలిపారు. ప్రేమ జంట ఆత్మహత్యపై వారి బంధువులు సమాచారం అందించారని, పోలీసులు అక్కడికి చేరుకోగా ఘటనా ప్రదేశంలో రెండు తుపాకీలతో పాటు మద్యం సీసాలు, సిగరెట్లు మృతదేహాల వద్ద లభ్యమయ్యాయని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top