నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. దారుణం

Man Murdered In Front Of People In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపారు దుండగులు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా రుద్రారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రుద్రారం ముంబై హైవేపై మహమూద్‌ అనే వ్యక్తిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా నరికి చంపారు. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఐదు నెలలక్రితం లక్డారంలో జరిగిన హత్యకేసులో మహమూద్‌ నిందితుడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరినట్లు తెలుస్తోంది. హత్య చేసిన వారు పాత నేరస్తులేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top