మహిళ గొంతు కోసేశాడు!

Man Murder Attempt On Woman At Badvel In Kadapa District - Sakshi

తన కుమార్తె ఫోన్‌ నంబర్‌ వేరే వ్యక్తికి ఇచ్చిందని కక్ష

బద్వేలు అర్బన్‌: తన కుమార్తె ఫోన్‌ నంబర్‌ను వేరే వ్యక్తికి ఇచ్చి ఇబ్బందుల పాలు చేస్తోందన్న కారణంతో ఓ వ్యక్తి పట్టపగలే అందరూ చూస్తుండగానే మహిళ గొంతు కోశాడు. తీవ్రగాయాల పాలైన మహిళను స్థానికులు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సిద్దవటం రోడ్డులోని నూర్‌బాషాకాలనీలోని పొట్టేటి వెంకటసుబ్బారెడ్డి, సుబ్బలక్షుమ్మ (48) దంపతులు నివసిస్తున్నారు. ఈమె భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఒక్కతే ఉంటుంది. అదే కాలనీలో నివసించే దివానీబాషా అలియాస్‌ రాయపాటి బాషా టైలర్‌ పనిచేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

చిన్న కుమార్తె భర్త బెంగళూరులో పనిచేస్తుండడంతో ఆమె నూర్‌బాషాకాలనీలోని తండ్రి వద్దే ఉంటుంది. కొద్ది రోజులుగా దివానీబాషా కుమార్తెకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి తరచూ వేధిస్తున్నాడు. ఆ వ్యక్తికి దివానీబాషా ఫోన్‌ చేసి విచారించగా, సుబ్బలక్షుమ్మ తనకు ఫోన్‌ నంబర్‌ ఇచ్చిందని చెప్పాడు. దీంతో సుబ్బలక్షుమ్మపై కక్ష పెంచుకున్న దివానీబాషా ఆమెతో పలుమార్లు గొడవకు దిగాడు. మంగళవారం ఉదయం పాలు పితుకుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన సుబ్బలక్షుమ్మను అప్పటికే మాటు వేసి ఉన్న దివానీబాషా గొంతు కోశాడు.

ఈ పెనుగులాటలో ఆమె భుజంపై, చేతివేళ్లపై కూడా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సుబ్బలక్షుమ్మను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కాగా సుబ్బలక్షుమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దివానీబాషాను అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top