యువతులను బంధించి.. వీడియోలు తీసి..

UP Man Molested Women And His Wife Records Video - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మృగాడు ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడగా.. అతడి భార్య ఆ అకృత్యాన్ని కెమెరాలో చిత్రీకరించింది. వివరాలు.. సంజీవ్‌ లోహన్‌ అనే వ్యక్తి న్యూ మండీ ఏరియాలో ఇద్దరు యువతులను బంధించాడు. అనంతరం వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులు కూడా వారిపై ఘాతుకానికి తెగబడ్డారు.

ఈ దారుణాన్ని సంజీవ్‌ లోహన్‌ భార్య రీటా లోహన్‌ వీడియోలు తీసింది. వ్యభిచార వృత్తిలోకి దిగకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామంటూ భార్యాభర్తలిద్దరు వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు. ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంజీవ్‌, రీటాలపై ఫిర్యాదు చేయగా గురువారం పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top