కన్నకొడుకును కాల్చిచంపాడు..

Man Held For Killing Son Who Tried To Rape Cousin - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో వరసకు సోదరి అయ్యే బాలికపై లైంగిక దాడికి యత్నించిన 17 ఏళ్ల కుమారుడిని హత్య చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తిని, అతడి పెద్ద కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రామ సర్పంచ్‌ మనోజ్‌ జాదవ్‌ ఫిర్యాదు మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. వరుసకు సోదరి అయ్యే బాలికను పదేపదే లైంగికంగా వేధిస్తుండటంతో నిందితుడు తన కుమారుడిని తన వ్యవసాయ క్షేత్రంలోనే నాటు తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు ఆరోపించారు. అదే రోజు రాత్రి వ్యవసాయ క్షేత్రంలోనే హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. 

త నెల 25న బాలికపై లైంగిక దాడికి యత్నించిన చిన్న కుమారుడిపై తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుపాకీతో కాల్చిచంపాడని స్థానికులు చెప్పారు. కుమారుడు మరణించగా, గుట్టుగా వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు నిర్వహించడంతో అనుమానం వచ్చిన గ్రామసర్పంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా మూడురోజలు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఇంకా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేంద్ర కుమార్‌ శర్మ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top