వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

Man Flung 30 Feet As Speeding Audi Rams Bike At Intersection In Jaipur - Sakshi

జైపూర్‌ : ఒళ్లు గగుర్పొడిచే రీతిలో జైపూర్‌లో జరిగిన ఓ ప్రమాదం విజువల్స్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. జైపూర్‌ సిటీలోని జేడీఏ సర్కిల్‌లో శుక్రవారం చోటుచేసుకున్నఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. సిగ్నల్‌ క్రాస్‌ చేస్తున్న ఓ టూ వీలర్‌ను వేగంగా దూసుకొచ్చిన ఆడికారు ఢీకొట్టింది. దీంతో టూ వీలర్‌ పైన ఉన్న వ్యక్తి అమాంతం గాల్లోకి లేచి 30 అడుగుల దూరంలో పడ్డాడు. ఇక కారు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారీకాగా అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దార్థ్‌ శర్మగా గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడ్డ అభయ్‌ దగర్‌ ప్రస్తుతం జైపూర్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత మంగళవారం ఇదే సర్కిల్‌లో ఓ కారు బైకర్స్‌పైసకి వేగంగా దూసుకు రావడంతో ఇద్దరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top