అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Man Dies Suspicious Status Warangal - Sakshi

గణపురం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. గణపురం ఎస్సై గోవర్థన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుందయ్యపల్లె గ్రామానికి చెందిన బిల్లా రాంరెడ్డి(52) శనివారం సాయంత్రం పని మీద చెల్పూరు గ్రామానికి వెళ్లాడు. రాత్రి సమయంలో ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికారు.

కాని ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉద యం చెల్పూరు గ్రామంలోని అన్నపూర్ణ సినిమా థియేటర్‌ వెనుక ప్రాంతంలోని మర్రి చెట్టు కింద రాంరెడ్డి మృతి చెంది ఉన్నాడని తెలిసింది. రాంరెడ్డి తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి వుండడంతో ఎవరైన తలపై బండ రాళ్లతో నైనా, లేద కర్రలతో నైన కొట్టి చంపి ఉంటారా లేదా రాంరెడ్డి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండరాయి పై జారి పడి తీవ్ర రక్త స్రావం జరిగి మృతి చెందాడా అనే అనుమానాలు ఉన్నాయని ఎస్సై తెలిపారు.

రాంరెడ్డి వివాద రహితుడని అతనిని చంపాల్సిన అవసరం ఎవరికి లేదని గ్రామస్తులు అంటున్నారు. మృతుడికి భార్య స్వరూప, ఒక కూతురు వున్నారు. మృతుడు భార్య స్వరూప తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వుండవచ్చని ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఘటన స్థలాన్ని క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీ చేయించారు. ములుగు డీఎస్పీ విజయ పార్థసారధి, సీఐ సార్ల రాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మెడికల్‌ రిపోర్టు ఆధారంగా రెండురోజుల్లో కేసు వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top