పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

Man Died In Road Accident In While Returning To Wedding Shopping At Kadapa - Sakshi

లారీ ఢీకొని యువకుడి మృతి

పెళ్లి దుస్తులు కొనుగోలు చేసి వెళ్తుండగా ప్రమాదం

సంఘటన చూసి గుండె పోటుకు గురైన మృతుడి తండ్రి

సాక్షి, పులివెందుల (కడప): మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వరుడిని మృతువు కభలించింది. ఎంతో ఉత్సాహంతో పెళ్లి దుస్తుల కోసం పులివెందులకు వచ్చి తిరిగి తన స్వగ్రామానికి వెళుతున్న సమయంలో లారీ రూపంలో ఆ యువకుడిని మృత్యువు వెంటాడింది. ఈ సంఘటన చూసి యువకుడి తండ్రి గుండె పోటుకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేముల మండలం భూమయ్యగారిపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి, నిర్మల ఒక్కగానొక్క కుమారుడు సోగలపల్లె మహేశ్వరరెడ్డి (25). అతడు తుమ్మలపల్లె వద్ద ఉన్న యురేనియం ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహించేవాడు.

ఈ నేపథ్యంలో యువకునికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వచ్చేనెల 3వ తేదీన  వివాహం జరగాల్సి ఉంది. అయితే అందుకు సంబంధించిన పెళ్లి దుస్తుల కోసం శనివారం మహేశ్వరరెడ్డి పులివెందులకు బైకుపై వచ్చాడు. కొనుగోలు చేసి తిరిగి తన స్వగ్రామానికి వెళుతుండగా పట్టణంలోని ఎర్రగుడిపల్లె సమీపంలోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఏపీ07టీహెచ్‌3453 అనే నెంబర్‌ గల లారీ పులివెందుల నుంచి కడపకు వేగంగా వెళుతూ మహేశ్వరరెడ్డి బైకును ఢీకొని కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

యువకుని తండ్రికి గుండె పోటు
కుమారుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తండ్రి సోగలపల్లె శంకర్‌రెడ్డి వెంటనే పులివెందులకు చేరుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉన్న కుమారుడు మృతదేహాన్ని చూడటంతో తట్టుకోలేక ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

పరామర్శించిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఇతర నేతలు
మహేశ్వరరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించి.. అక్కడ చికిత్స పొందుతున్న శంకర్‌రెడ్డిని పరామర్శించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా మృత్యువాత పడటం ఆవేదన కలిగిస్తోందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విచారంలో మునిగిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరామిరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు నివాళి అర్పించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top