‘నా చావుకి అత్తే కారణం’

Man Commits Suicide With Wife Mother Harassment in Prakasam - Sakshi

మృతుని మరణ వాంగ్మూల లేఖ

ప్రకాశం, కురిచేడు: పిల్లనిచ్చిన అత్త వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైల్వే స్టేషనులో త్రిపురాంతకం మండలం కొత్త ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకర శర్మ (40) శనివారం రాత్రిరైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద పోలీసులకు మరణవాంగ్మూల లేఖ లభించింది. దానిలో.. తన ఆత్మహత్యకు తన అత్త గుళ్ళపల్లి మారుతి దేవి కారణం అని రాసి ఉంది.  మృతుడు తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమే జీవితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నాడు. ముందుగా తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో వివాహం కాగా మారుతి దేవి.. బలవంతంగా విడాకులు ఇప్పించి ఆమె కుమార్తెతో తనకు మళ్లీ వివాహం చేసినట్లు పేర్కొన్నాడు.

వారికి ముగ్గురు సంతానం కలిగిన అనంతరం తన అత్త తనను వదిలి సముద్రాల రామాచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని హైదరాబాదుకు మకాం మార్చిందని చెప్పాడు. అయితే అతన్ని మనుషులతో కొట్టించి తాను కొట్టించినట్లుగా కేసు పెట్టిందని పేర్కొన్నాడు. అలాగే తాను మృతిచెందినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం పొంది ఎల్‌ఐసీ నుంచి డబ్బు పొందేలా ప్రేరేపించినట్లు పేర్కొన్నాడు. ఆ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి తనను జైలుకు పంపారన్నారు. బెయిల్‌ పొంది బయటకు వచ్చిన తర్వాత భార్య నుంచి నన్ను విడదీసి మానసిక క్షోభకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. ఇవన్నీ తట్టుకోలేక తన స్నేహితులకు సూసైడ్‌నోట్‌ వాట్సాప్‌ ద్వారా పంపినట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్‌ నంబర్లు కూడా పెట్టాడు. తనకు తన కుమారునితో తలకొరివి పెట్టించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. దొనకొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top