భార్య శవాన్ని నూతిలో ఉప్పుపాతరవేసి..

Man Buried Wife Dead Body In Well - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : భీమడోలు మండలంలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. భర్త సదరు వివాహిత మృతదేహాన్ని నూతిలో ఉప్పుపాతరవేసి పూడ్చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన కోటా రామలక్ష్మి కొద్దిరోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఆమె భర్త శ్రీను.. రామలక్ష్మి మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని మంచినీటి స్టోరేజ్‌ నూతిలో పడేసి ఉప్పుపాతరవేసి కాంక్రీట్‌తో నూతిని పూడ్చేశాడు.

రామలక్ష్మి కనిపించకపోయే సరికి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే రామలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరుపు బంధువులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top