కడపలో దారుణ హత్య

Man Brutally Murdered In YSR kadapa District - Sakshi

మద్యం మత్తులో ఘర్షణ

హత్యచేసి పరారైన ఉత్తరప్రదేశ్‌ యువకులు 

సాక్షి, కడప : మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి కడప నగరంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై మృతుని భార్య మలాన్, బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.   కడప నగరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గౌస్‌నగర్‌కు చెందిన షేక్‌ ఇంతియాజ్‌ (26) అనే వ్యక్తి తన భార్య మలాన్‌తో పాటు నివసిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా మాసాపేట సర్కిల్‌ ప్రాంతంలో ఉన్న నూరుద్దీన్‌కు చెందిన చికెన్‌ షాపులో పనిచేస్తున్నాడు. రోజులాగానే చికెన్‌షాపులో పనిచేసిన తరువాత తాను అప్పుడప్పుడు వచ్చి విశ్రాంతి తీసుకునే నకాష్‌ ప్రాంతంలోని ఓ గదికి ఆదివారం సాయంత్రం వచ్చాడు. అదే గదిలో ఉత్తరప్రదేశ్‌ నుంచి బతుకుదెరువు నిమిత్తం వచ్చిన నలుగురు యువకులు ఆదిల్, సొహైల్, అమీర్, జునాయద్‌ అనే వారు ఉంటున్నారు. వారితో కలిసి ఇంతియాజ్‌ ఆదివారం రాత్రి మద్యం సేవించాడు. ఆ క్రమంలో ఇంతియాజ్‌కు, నిందితులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

ఈ ఘర్షణలో నిందితులు అర్ధరాత్రి సమయంలో తమ దగ్గరున్న రాడ్‌తో ఇంతియాజ్‌ తలపై దాడిచేశారు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున నిందితులు నలుగురు గది ఓనర్‌కు ఫోన్‌చేసి తమ బంధువైన ఓ మహిళ ఆకస్మికంగా మృతి చెందిందని, తాము వెళుతున్నామని చెప్పారు. తెల్లవారగానే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ మాట్లాడుతూ ఇంతియాజ్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులే హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top