గొంతు కోసి.. ఛాతీలో పొడిచి

Man Brutal Murder In Banswara - Sakshi

రాంపూర్‌లో ఒకరి దారుణ హత్య 

వివరాలు సేకరించిన డాగ్‌ స్క్వాడ్‌

బాన్సువాడ రూరల్‌: మండలంలోని చిన్న రాంపూర్‌ గ్రామ శివారులో శనివారం రాత్రి దారుణ హ త్య జరిగింది. జక్కల్‌దాని తండా–దుర్కి ప్రధాన రహదారిపై కల్వర్టు పనులు జరుగుతున్న ప్రదేశంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బీర్కూర్‌ బోయి గంగారాం(55)ను గుర్తుతెలియని వ్యక్తుల అతి కి రాతకంగా హత్య చేశారు. పని ప్రదేశంలో నిలిపిన టిప్పర్‌ క్యాబిన్‌లో పడుకున్న గంగారాంను పథ కం ప్రకారం నిద్రలేపి తీవ్రంగా కొట్టి ఛాతీలో కత్తి తో పొడిచి, గొంతుకోసి హతమార్చారు. ఉదయం పొలం వద్దకు వెళ్లే గ్రామస్తులు చూసి హత్య గురించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరా లు సేకరించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీం సభ్యులు చేరుకుని విచారించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే హత్యకు గురైన బీర్కూర్‌ బోయి గంగారాం రాం పూర్‌ గ్రామానికి ఇల్లరికం వచ్చాడని, అందరితో కలిసి మెలిసి జీవించేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు.

వయస్సు మీదపడిన రోజువారి కూలీకి వెళ్ళే కష్టపడే మనస్థత్వం గలవాడని తెలిపారు. గ్రామంలో ఇతనికి ఎలాంటి భూ తగాదాలు గాని, వివాహేతర సంబంధాలు గాని లేవని తెలిసింది. ఇతడికి కుమారుడు విఠల్, కోడలు, భార్య ఉన్నా రు. గతంలో మృతుడి కోడలితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను మందలించడంతో పాటు ఇతర అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి కుమారుడు విఠల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top