అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లు పంపిన వ్యక్తి అరెస్టు

Man arrested in Cyber crime case - Sakshi

జయపురం :పదిరోజుల కిందట వివాహమైన ఒక యువతి అశ్లీల చిత్రాలు గల వీడియో క్లిప్పింగ్‌లను ఆమె భర్తకు వాట్సాప్‌లో పోస్ట్‌ చేసిన యువకుడిని జయపురం సదర్‌ పోలీసులు పట్టకున్నారు. ఆ నిందితుడిని గంజాం జిల్లా అస్కా ప్రాంతంలోని దామోదరపూర్‌లో   నిర్బంధించినట్లు పోలీసులు వెల్లడించారు.  ఆ నిందితుడిని రామకృష్ణ రెడ్డిగా గుర్తించారు. నిందితుడి వద్ద పలు ముఖ్యమైన ఆధారాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుని దగ్గరినుంచి ఒక మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అందులో అనేక అశ్లీల చిత్రాల క్లిప్పింగ్‌లు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేశామని జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారి  కైలాస  చంద్ర శెట్టి వెల్లడించారు. ఆ టీమ్‌ రామకృష్ణ ఫోన్‌ను ట్రాప్‌ చేసింది. దీంతో గంజాం జిల్లా అస్కా ప్రాంతంలో ఉన్నట్లు తెలియడంతో  టీమ్‌ వెళ్లింది. నిందితుడు  దామోదరపూర్‌ బజార్‌ ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం విఫల మైంది.

అయితే రెండవసారి  పన్నిన వలలో రామకృష్ణ పడ్డాడని పోలీసులు తెలిపారు. రామకృష్ణ బొరిగుమ్మలో పనిచేసే సమయంలో ఆ  యువతి వంటచేసి పెడుతుండేది. అప్పుడు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం ఏర్పడిన నాటినుంచి రామకృష్ణ తన భార్యను, 5 ఏళ్ల బిడ్డను విడిచి ఆమెతోనే కలిసి  ఉండేవాడు.  అయితే ఆమె తనను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో కక్ష గట్టి    ఆమె అశ్లీల వీడియో చిత్రాలు భర్తకు పంపాడని పోలీసులు వెల్లడించారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top