ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

lovers suicide attempt - Sakshi

టి.నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గ్రామానికి చెందిన నెల్లూరి పవన్‌(21), కాకిలేటి కిరణి(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండు నెలల క్రితం పవన్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం కిరణికి తెలిసింది. మనోవేదనకు గురైన ఆమె బొర్రంపాలెం వచ్చింది. పవన్‌కు ఫోన్‌ చేసి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. ఆమెను ఆ పరిస్థితిలో చూసిన పవన్‌ తనపై ఎక్కడ కేసు అవుతుందోననే ఆందోళనతో తాను కూడా పురుగుల మందు తాగాడు. అచేతనంగా పడి ఉన్న వీరిని స్థానికులు గమనించి వెంటనే 108లో చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిద్దరూ కోలుకచుంటున్నారు. చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Back to Top