ఏకాంతంగా దొరికారు.. గుండుకొట్టించారు!

Locals Shaved Heads of a Man and a Woman After the Man Went to Visit Her Home - Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ యువకుడు తన ప్రియురాలితో ఏకాంతంగా గడపుతుండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు ఇద్దరిని విచక్షణా రహితంగా చితకబాదారు. అందరి ముందు గుండు కొట్టించారు. ఈ ఘటన మయూర్‌భంజ్‌, కరంజిలా బ్లాక్‌లోని మండువా గ్రామంలో గత శనివారం(జూన్‌ 22)న చోటుచేసుకుంది. వారిద్దరికి గుండు కొట్టించడమే కాకుండా సెలఫోన్లలో ఫొటోలు తీశారు. అవి కాస్త సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ కావడంతో పోలీసులు దృష్టికి వచ్చింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇక మేజర్లైన యువతీ యువకులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

చదవండి : మరిన్నీ ఒడిశా వార్తలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top