‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

Krishna Additional SP Moka Sattibabu Comments On Aditya Murder Case - Sakshi

చల్లపల్లి బీసీ హాస్టల్‌ విద్యార్థి ఆదిత్యను హత్య చేశారు

విచారణ కోసం 4 బృందాలు ఏర్పాటు చేశాం

కృష్ణాజిల్లా అడిషినల్‌ ఎస్పీ మోకా సత్తిబాబు

సాక్షి, కృష్ణా : చల్లపల్లి బీసీ హాస్టల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన దాసరి ఆదిత్యది(8) హత్యేనని అడిషినల్‌ ఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాత్రి రెండు గంటల తర్వాత ఈ హత్య జరిగిందని వెల్లడించారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆయుధాలు లభించలేదన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి హాస్టల్‌ వాచ్‌మెన్‌ డ్యూటీలో లేడని, సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని అడిషినల్‌ ఎస్పీ వెల్లడించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ కేసు విచారణ కోసం 4 బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని అడిషినల్‌ ఎస్పీ సత్తిబాబు పేర్కొన్నారు. 

(చదవండి : హాస్టల్‌లో అమానుషం ​; బాత్రూంలో మృతదేహం)

హాస్టల్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం
మూడోతరగతి విద్యార్థి ఆదిత్య మృతిపై బీసీ వెల్ఫేర్‌ హాస్టల్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమాభార్గవి స్పందించారు. హాస్టల్‌ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. హత్య జరిగిన రాత్రి హాస్టల్‌లో వాచ్‌మెన్‌, వార్డెన్‌ లేరన్నారు. బయట వ్యక్తులు లోపలికి రావడం వల్లే ఈ హత్య జరుగొచ్చనే అనుమానం తనకు ఉందన్నారు. హాస్టల్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసులు విచారణలో నిందితులెవరో తెలుస్తుందని రమా భార్గవి అన్నారు.

మరిది, వాచ్‌మెన్‌పై అనుమానం
వాచ్‌మెన్‌తో కలిసి తన మరిదే తన కొడుకును హత్య చేశారని ఆదిత్య  తల్లి ఆదిలక్ష్మీ ఆరోపించారు. వారిద్దరిపైనే తమకు అనుమానం ఉందన్నారు. తన బిడ్డకు జరినట్లు ఏ బిడ్డకు జరుగొదంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top