విద్యార్థినులతో ఇన్విజిలెటర్‌ అసభ్యకర ప్రవర్తన

Invigilator Misbehaves With Students - Sakshi

మాచారెడ్డి: ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక ఇన్విజిలెటర్‌ ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థినులపట్ల మూడు, నాలుగు రోజులుగా ఓప్రైవేట్‌ ఇన్విలెటర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మీద చేతులు వేస్తున్నాడని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు.

కీచక ఇన్విజిలెటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ ఇన్విజిలేటర్‌ను నియమించారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల విద్యాధికారి నియమించిన ఇన్విజిలెటర్లనే విధుల్లోకి తీసుకోవాల్సి ఉండగా కళాశాల యాజమాన్యం తమ ఇష్టానుసారంగా ప్రైవేట్‌ ఇన్విజిలెటర్లను నియమించుకోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు అందలేదు
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇన్విజిలెటర్‌పై ఫిర్యాదు అందలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top