అమెరికాలో భారతీయ వ్యక్తి ఆత్మాహుతి

Indian Burns Self At Washington - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో ఆర్ణవ్‌ గుప్తా (33) అనే ఓ భారతీయుడు తనకుతాను నిప్పంటించుకుని చనిపోయాడని పోలీసులు గురువారం చెప్పారు. మేరీలాండ్‌ రాష్ట్రంలోని బెథెస్దలో ఉంటున్న ఆర్ణవ్‌ బుధవారం మధ్యాహ్నం శ్వేతసౌధం సమీపంలోని ఎల్లిప్స్‌ అనే పార్క్‌లో నిప్పంటించుకున్నాడు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణిం చాడు. అంతకుముందు బుధవారం ఉదయమే ఆర్ణవ్‌ కనిపించడంలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆర్ణవ్‌ కనిపిస్తే చెప్పాల్సిందిగా ప్రజలను కోరుతూ పోలీసులు నోటీసులు కూడా అంటించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఆర్ణవ్‌ తనకుతాను నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడం కోసం ఆయన వాడిన రసాయనం ఏంటో నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎల్లిప్స్‌ పార్క్‌కు దగ్గర్లో ఆర్ణవ్‌ తన కారును ఎక్కడైనా నిలిపాడేమోనని పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై విచారణ జరుగుతోంది. కాగా, ఆర్ణవ్‌ నిప్పంటించుకున్నాక ఆ ఘటనను అలెగ్జాండ్రియాకు చెందిన ఓ బాలిక వీడియో తీయగా, ఆమె తండ్రి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top