జిల్లాలో పెరుగుతున్న నేర సంస్కృతి  

Increasing Crime Culture In The Kamareddy District - Sakshi

ఆందోళన కలిగిస్తున్న నేరాలు

పగ, ప్రతీకారం, వివాహేతర సంబంధం, ఆస్తి, భూ వివాదాలు... కారణం ఏదైనా దాడులు చేస్తున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు. వారం రోజుల్లోనే జిల్లాలో ఐదు హత్యలు జరిగాయి. పెరుగుతున్న నేర సంస్కృతి జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

సాక్షి, కామారెడ్డి : మనుషుల్లో పెరిగిన నేర స్వభా వం హత్యలకు కారణమవుతోంది. కొన్ని సంఘటనలు క్షణికావేశంలో చోటు చేసుకుంటుండగా.. మరికొన్ని పథకం ప్రకారం జరుగుతున్నాయి. ఏది ఏమైనా మనుషుల ప్రాణాలు సులువుగా తీసేస్తున్నారు. ప్రాణాలు తీసిన వారు ఏరోజైనా చట్టానికి చిక్కాల్సిందే. కటకటాలు లెక్కించాల్సిందే.

అయినప్పటికీ హత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వారంలో జిల్లాలో వేర్వేరు సంఘటన ల్లో ఐదుగురు హత్యకు గురయ్యారు. మూడు హత్యలకు సంబంధించి నేరస్తు లు చట్టానికి చిక్కారు. మరో రెండు సంఘటనలు సోమవారం వెలుగు చూశా యి. నాలుగు సంఘటనల్లో ఐదుగురు హత్యకు గురికాగా.. అందులో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం.  

‘పంచాయితీ’లో వ్యతిరేకంగా ఉన్నాడని..

గత నెల 29న రాత్రి భిక్కనూరు మండ లం జంగంపల్లి గ్రామంలో అత్తెల్లి రమేశ్, ముదాం రాములు అనే ఇద్దరు హత్యకు గురయ్యారు. దుండగులు వారిని ఇనుపరాడు, బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ కేసులో అదే గ్రా మానికి చెం దిన సిద్దిరాములు అనే వ్యక్తిని పోలీసు లు సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపించా రు.

కుటుంబ తగాదా విషయంలో పంచాయతీ పెద్దగా వ్యవహరించిన రమేశ్‌ తనకు వ్యతిరేకంగా పనిచేశాడని పగ పెంచుకున్న సిద్దరాములు.. పథ కం ప్రకారం రమేశ్‌ను హతమార్చాడు. అతనితో ఉన్న రాములు ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడతాడోనని సందేహించి అతడినీ చంపేశాడు.

చట్టానికి చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినా ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఇద్దరి ప్రాణాలు తీసిన సిద్దరాములు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కించాల్సి వస్తోంది. 

వివాహేతర సంబంధం అనుమానంతో.. 

గత నెల 30వ తేదీ రాత్రి నిజాంసాగర్‌ మండలం ఆరేడ్‌ గ్రామంలో కుర్మ సుమలత (21) మృతిచెందింది. అనారోగ్యంతో మరణించిందని ఆమె అ త్తామామలు తెలిపారు. అనుమానించిన సుమలత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కోడలు వివాహేతర సంబంధం నెరపుతోందనే అనుమానంతో అత్తామామలే గొంతును లిమి చంపినట్లు తేలింది. హత్యకు పాల్పడిన అత్తామామలు.. కటకటాల పాలయ్యారు. 

సోమవారం మరో రెండు హత్యలు.. 

వారంలో జరిగిన రెండు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. వాటికి సంబంధించి వివరాలను మీడియాకు తెలియజేస్తున్న సమయం లోనే జిల్లాలో మరో రెండు చోట్ల ఇద్దరి హత్య జరిగిందన్న విషయం తెలిసింది.

బిచ్కుంద మండలం గుండెనెమ్లి గ్రామ శివారులోని కల్వర్టుకింద ముప్పై ఏళ్ల వయసున్న ఓ మహిళ మృతదేహం లభించింది. ఆమె చేతులు, కాళ్ల ను బంధించి చంపేశారు. ఈ హత్య మూడు, నాలుగు రోజుల క్రితం జరిగినట్లు భావిస్తు న్నారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో గుర్తించడానికి వీలుకాలేదు.  

నస్రుల్లాబాద్‌ మండలంలోని నెమ్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మరో మహిళ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన గంగవ్వగా గుర్తించారు. ఆమెను దారుణంగా కొట్టి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు హత్యలు కూడా çపథకం ప్రకారమే జరిగి ఉంటాయని భావిస్తున్నారు. 

విషమిస్తున్న నేర సంస్కృతి.... 

కారణం ఏదైనా కావచ్చు మనిషి ప్రాణాలను తీసేందుకు వెనుకాడడం లేదు. నేరసంస్కృతి పెరుగుతుండడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చాలా చోట్ల బంధువులు, స్నేహితులు, రక్తసంబంధీకులే హంతకులవుతున్నారు. వారం రోజుల్లో జరిగిన హత్య కేసుల్లో ఒకటి అత్తింటి వారే హతమార్చగా, మరో ఇద్దరి హత్య పాత పగతో జరిగినది. మిగతా ఇద్దరు మహిళల హత్యలపై విచారణ కొనసాగుతోంది. చిన్నచిన్న విషయాలకే హత్యలకు తెగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top