తమ్ముడిని పట్టించుకోవడం లేదనే కోపంతో..

Husband Suicide After Killing Wife In Chennai - Sakshi

సాక్షి, చెన్నై : మానసిక వ్యాధితో బాధపడుతున్న తమ్ముడిని పట్టించుకోవడం లేదనే కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. అనంతరం తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కోవైలో సోమవారం చోటు చేసుకుంది. వేడపట్టి నంజప్పకౌండర్‌ వీధికి చెందిన మారిముత్తు (65) కోవైలోని ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. మొదటి భార్య కరునయమ్మాల్‌. వీరికి ఓ కుమార్తె ఉంది. భార్యభర్తల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో 20 ఏళ్ల క్రితం విడిపోయారు. అనంతరం మారిముత్తు అదే ప్రాంతానికి చెందిన సుబ్బాత్తాల్‌ (61)ను రెండో వివాహం చేసుకున్నాడు. సుబ్బాత్తాల్‌ ఎండు చేపల వ్యాపారం చేస్తోంది. వీరికి పిల్లలు లేరు. మారిముత్తుకి మానసిక వ్యాధికి గురైన తమ్ముడు ఉన్నాడు. అయితే భార్యభర్తలు ఇద్దరూ పనికి వెళ్లడం వల్ల తమ్ముడి బాగోగులను చూసుకోలేకపోతున్నాడు. దీంతో అతను ఆ ప్రాంతంలో బిచ్చం ఎత్తుతూ కడుపు నింపుకుంటున్నాడు.

తమ్ముడి విషయం మారుముత్తను కలిచి వేస్తూ వచ్చింది. దీంతో భార్యను పనికి వెళ్లవద్దని ఇంటి వద్దే ఉంటూ తమ్ముడిని చూసుకోవాలని సూచించాడు. ఈ కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం మారిముత్తు తమ్ముడు బిచ్చం ఎత్తుకుని తిన్నట్లుగా తెలిసింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన కొందరు మారిముత్తును ప్రశ్నించారు. దిగ్భ్రాంతి చెందిన ఇతను ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహించిన మారిముత్తు భార్య తలపై రోకలిబండతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆందోళనకు గురైన మారుముత్తు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top