భార్యను ఉరి వేసి చంపిన భర్త

నిత్యం వేధిస్తుండటంతో
విసిగిపోయి అఘాయిత్యం
కృష్ణాజిల్లా, చండ్రగూడెం (మైలవరం) : కట్టుకున్న భార్యను ఉరి వేసి భర్తే చంపిన ఘటన చండ్రగూడెం గ్రామంలో గురువారం జరిగింది. మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన మందా యేసుబాబుకు అక్క కూతురు లలితకుమారి (30) తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. యేసుబాబు చండ్రగూడెంలో చిన్న కిరాణా షాపుతో పాటు చిన్న హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాగా భార్య లలితకుమారిని నిందితుడు ఉరి వేసి హత్య చేశాడు. ఈ విషయాన్ని నిందితుడే స్వయంగా పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. తన భార్య నిత్యం వేధిస్తుండటంతో విసిగిపోయి ఉరి వేసి చంపానని పోలీసులకు వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి