రాజ్‌తరుణ్‌ కారు కేసులో కొత్త ట్విస్ట్‌

Hero Raj Tarun Car Accident At narsingi Visuals Goes Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హీరో రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగుచూసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్‌ బయట పడింది. కారు ప్రమాద దృశ్యాలను అక్కడి స్థానికుడు కార్తీక్‌ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ సమయంలో కారు దిగి పరుగులు పెడుతున్న రాజ్‌ తరుణ్‌ను వెంటాడి పట్టుకున్నాడు. తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి.

అయితే ఆ వీడియోలు ఇవ్వమని కార్తీక్‌కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ నటుడు రాజా రవీంద్ర తనను ఫోన్‌లో బెదిరిస్తున్నాడంటూ స్థానికుడు తెలిపాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు తెలిపాడు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారించలేదు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన రెండు రోజులు తరువాత ఓ వీడియో ద్వారా.. తాను క్షేమంగానే ఉన్నట్లు, సీటు బెల్టు పెట్టుకోవడంతో బయటపడినట్లు రాజ్‌తరుణ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top