వరంగల్‌లో యువతి దారుణ హత్య

Girl Murdered In Warangal Urban District - Sakshi

వరంగల్ అర్బన్: జిల్లాలోని హంటల్‌ రోడ్డులో యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. హన్మకొండలోని నందినిహిల్స్‌ వద్ద యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం భద్రకాళి ఆలయానికి వెళ్లిన యువతి తిరిగిరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిన్నరాత్రి(బుధవారం) 11 గంటల తర్వాత యువతి మృతదేహాం లభ్యమైంది.

దీనిని దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన మల్లయ్య, స్వరూప దంపతుల కుమార్తె మానసగా గుర్తించారు. కన్నకూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌ మార్చురీకి తరలించారు. యువతిపై అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిపై హత్యచారం చేసిన నిందితుడు సాయిగౌడ్ సుబేదారి పోలీసులకు లొంగిపోయాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top