డ్యామ్‌ వద్ద సెల్ఫీ.. నలుగురి మృతి

Four People Fall In Water Taking Selfie At Pambaru Dam In Tamil Nadu - Sakshi

కృష్ణగిరి : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో సెల్ఫీ సరదా నలుగురి ప్రాణాలను బలిగొంది. బర్కూర్‌కు చెందిన ప్రభుకు ఇటీవల నివేదితతో వివాహాం అయింది. వారు తమ బంధువులు కనిత, స్నేహ, యువరాణి, సంతోష్‌లతో కలిసి ఆదివారం సాయంత్రం పాంబారు డ్యామ్‌ సందర్శనకు వెళ్లారు. డ్యామ్‌ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వారంతా సిద్ధమయ్యారు. ప్రభు ఫోన్‌ పట్టుకుని ఉండగా.. మిగిలిన వారు సెల్ఫీకి స్టిల్‌ ఇస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ప్రభు మినహా మిగిలిన వారంతా నీటిలో పడిపోయారు. దీంతో ప్రభు నీటిలోకి దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఒక యువరాణిని మాత్రమే కాపాడగలిగాడు. మిగిలిన వారు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కాపాడేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత నీటిలో కొట్టుకుపోయిన నివేదిత, కనిష్క, స్నేహ, సంతోష్‌ మృతదేహాలను బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు. మృతులంతా దగ్గరి బంధువులే కావడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top