చీటింగ్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి మనుమడు అరెస్ట్‌

Former TDP minister grandson arrested in cheating case - Sakshi

సీతమ్మధార (విశాఖ ఉత్తర): ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి నిలువునా ముంచిన టీడీపీ మాజీ మంత్రి మనుమడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాలను శనివారం విశాఖ నాలుగో పట్టణ సీఐ ఈశ్వరరావు మీడియాకు వెల్లడించారు. విశాఖ జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్‌కు తిరుపతి సమీపాన రామచంద్రపురంలోని టీడీపీ క్రియాశీల సభ్యుడు ఎల్లంటి భక్తవత్సల నాయుడు కుమార్తె ఎల్లంటి లోచినితో 2013లో వివాహమైంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్‌ తన తాతతో కలిసి సచివాలయానికి తరచూ వెళ్తూ అధికారులతో పరిచయం పెంచుకున్నాడు. తన భార్య మధ్యప్రదేశ్‌ ఐఏఎస్‌ క్యాడర్‌కు చెందిన అధికారి అని, చంద్రబాబు తనకు బాగా సన్నిహితమని చెప్పుకుంటూ, ఫొటోలు చూపుతూ ప్రభుత్వ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేశాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది.

అమ్మ మ్యాన్‌పవర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ద్వారా నిరుద్యోగుల నుంచి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి తప్పుడు నియామక పత్రాలందించాడు. దీనిపై బాధితులు విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదుచేశారు. విశాఖ పోలీసులు  నిందితులను అరెస్ట్‌ చేశారు. అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా వారికి రిమాండ్‌ విధించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top