పోర్న్‌ వీడియోలు చూడమని బలవంతం చేస్తూ..

Forced To Watch Porn And Raped Six Months In Bhopal - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భోపాల్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌ నిర్వాహకుడే యువతులపై అకృత్యాలకు పాల్పడ్డారు.  వివరాల్లోకి వెళ్తే.. 36 ఏళ్ల అశ్విన్ శర్మ తన ఎన్జీవో ద్వారా భోపాల్‌‌లో రెండు హాస్టళ్లను నిర్వహిస్తున్నాడు. వీటికి సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం చేస్తోంది. కాగా అద్దె ఇంట్లో వికలాంగ యువతుల కోసం హాస్టల్ నడుపుతున్న శర్మ.. తనను రేప్ చేశాడని బధిర యువతి ఆరోపించింది. శర్మ తమను కూడా రేప్ చేశాడని ఇప్పటి వరకూ నలుగురు యువతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 పోర్న్‌ వీడియోలు చూడమని బలవంతం చేస్తూనే తనపై ఆరు నెలలుగా అత్యాచారం నెరిపాడని ఆరోపించింది. ఇతర అమ్మాయిలనూ అతడు హింసించడం తాను చూశానని, వారంతా భయంతో ఇప్పటి వరకూ నోరు మెదపలేదని తెలిపింది. దీంతో హాస్టల్ డైరెక్టర్ అశ్విని శర్మను పోలీసులు  అరెస్ట్ చేశారు. అతడిపై బెదిరింపులు, తప్పుడు నిర్బంధం, అమానుషాలను నిరోధించబడే నేరాల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top