బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులకు పట్టించింది...

Florida Woman Take Her Boyfriend To Hospital And Call Police To Arrest Him - Sakshi

డిలాండ్‌, ఫ్లోరిడా : తనను గన్‌తో బెదిరించి, రెండు రోజుల పాటు బంధించడమే కాక చిత్రహింసలు పెట్టిన బాయ్‌ఫ్రెండ్‌ను తెలివిగా పోలీసులకు పట్టించింది ఫోరిడాకు చెందిన ఓ యువతి. వివరాల ప్రకారం ఫ్లోరిడాకు చెందిన జెరెమీ ఫ్లాయిడ్‌ తన గాళ్‌ఫ్రెండ్‌ కుక్కకు ఆరోగ్యం బాగా లేకపోవటంతో, ఆమెతో కలిసి కుక్కను తీసుకుని ఫ్లోరిడాలోని జంతువుల ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ జెరెమీ గాళ్‌ఫ్రెండ్‌ ఒక కాగితం మీద ‘నా బాయ్‌ఫ్రెండ్‌ దగ్గర తుపాకీ ఉంది. దానితో అతడు బెదిరించడమే కాక నన్ను తీవ్రంగా కొట్టాడు. అతనికి తెలియకుండా ఎలా అయినా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయండి’ అని రాసి కింద నేల మీద పడవేసింది. ఆ కాగితాన్ని చూసిన ఆస్పత్రి వార్డుబాయ్‌ పోలీసులకు సమాచారం అందించాడు.


ఆస్సత్రికి చేరుకున్న పోలీసులు... విచారణ అనంతరం జెరెమీ మీద డొమెస్టిక్‌ వయెలెన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి పోలీసు అధికారి కౌంటీ షరీఫ్‌ ‘జెరెమీ తన స్నేహితురాలిని తుపాకీతో బెదిరించి, రెండు రోజుల పాటు గదిలో బంధించడమే కాక తీవ్రంగా కొట్టాడు. ఆమె అక్కడి నుంచి ఎలానో తప్పించుకుంది. అయితే  తనను హింసించిన జెరెమీని పోలీసులకు అప్పగించాలనే ఉద్ధేశంతో తన కుక్కకు ఆరోగ్యం బాగాలేదని, దానిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని జెరెమీని అభ్యర్ధించింది. ఆమె మాటలు నమ్మిన జెరెమీ కుక్కను తీసుకొని ఫ్లోరిడాలోని జంతువుల ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె...జెరెమీ  గురించి చీటీ మీద రాసి వార్డ్‌బాయ్‌కు ఇచ్చింది. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మేము ఆస్పత్రికి వెళ్లి అతన్ని అరెస్టు చేశామ’ని తెలిపాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top