సెల్ఫీ విసిరిన పంజా..ఐదుగురు మృతి

Five Drowned To Death In River In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : సెల్ఫీ సరదా పలు కుటుంబాల్లో ఘోర విషాదం మిగిల్చింది. బాలున్ని కాపాడబోయి నవవధువు, అతని అక్కలు నదిపాలయ్యారు. కొత్తగా పెళ్లయిన దంపతులు బంధువుల ఇంటికి వెళ్లి, సరదాగా నదీ సందర్శనకు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఊత్తంగేరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. మృతులను నవ వధువు నివేధ, బంధువులు స్నేహ, కనికా, సంతోష్‌గా గుర్తించారు. చివరి ముగ్గురు తోబుట్టువులు కావడం గమనార్హం. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా బర్గూరు మారియమ్మ ఆలయ వీధికి చెందిన గోవిందన్‌ కొడుకు పెరుమాళ్‌స్వామి. దుస్తుల వ్యాపారి. అదే ప్రాంతానికి చెందిన వేలుమణి కూతురు నివేధ (20)తో పెరుమాళ్‌స్వామికి గత నెల 12వ తేదీన పెళ్లి జరిగింది.

కొత్త దంపతులు బంధువుల ఇంట్లో విందులకు వెళ్లి వస్తుండేవారు. ఆదివారం ఊత్తంగేరి సమీపంలోని ఒట్టపట్టి గ్రామంలోని బంధువు ఇళంగోవన్‌ ఇంటికి విందుకెళ్లారు. విందు ముగించుకొని ఇళంగోవన్‌ కూతుర్లు స్నేహ (19),  కనికా(18),  కొడుకు సంతో‹Ù(14), మరో బంధువుల అమ్మాయి యువరాణి (20) కలిసి ఊత్తంగేరిలోని ఓ సినిమాకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సినిమా ముగించుకొని సమీపంలో ప్రవహిస్తున్న పాలారు నది అందాలను చూసేందుకెళ్లారు.  

సంతోష్‌ సెల్ఫీ తీసుకుంటూ  
ఈ సమయంలో బాలుడు కొడుకు సంతోష్‌ నదీ ఒడ్డున సెల్పీ తీసుకొంటూ కాలు జారి నదిలో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు అక్కలు స్నేహ, కనికాతో పాటు నూతన వధువు నివేధలు నదిలో దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోసాగారు. గమనించిన పెరుమాళ్‌స్వామి వెంటనే నదిలో దూకి నదిలో కొట్టుకెళ్లుతున్న ఐదు మందిని కాపాడేందుకు యతి్నంచాడు. వీలుకాకపోవడంతో యువరాణిని మాత్రం ప్రాణాలతో బయటకు తీశాడు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని నదిలో కొట్టుకెళ్లుతున్న నివేధ,  స్నేహ, కనికా, సంతో‹Ùలను బయటకుతీసేలోపే ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకొన్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రోధించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.   

రెండువారాల్లో 19 మంది నీటిపాలు  
క్రిష్ణగిరి జిల్లాలో గత 23వ తేదీ నుండి 6వ తేదీ వరకు 19 మంది నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. గత కొద్దిరోజులుగా క్రిష్ణగిరి జిల్లాలో వర్షాలు కురవడంతో చెరువులు, కుంటల్లో నీరు చేరింది. దక్షిణపెన్నానది, పాలారు నదిలో వరదనీరు ప్రవహిస్తోంది. గత నెల 23వ తేదీ నుండి 6వ తేదీ వరకు జిల్లాలో నదుల్లో ప్రమాదవశాత్తు నీటమునిగి 19 మంది మృత్యువాత డడ్డారు.

జిల్లాలో గత నెల 24వ తేదీ కందికుప్పం సమీపంలో ఇద్దరు, 25వ తేదీ అదే ప్రాంతంలో మరో ఇద్దరు,  26వ తేదీ హొసూరు హడ్కో సమీపంలో ఒకరు, 28వ తేదీ ఊత్తంగేరి ప్రాంతంలో ఇద్దరు, 30వ తేదీ మహారాజగడ ప్రాంతంలో ఒకరు, 1వ తేదీ  వేపనపల్లి సమీపంలో ముగ్గురు, 4వ తేదీ  సూళగిరి సమీపంలోని రామాపురం వద్ద ఇద్దరు, ఊత్తంగేరి వద్ద పై నలుగురూ మృతి చెందారు. జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పీడబ్ల్యూడీ శాఖాధికార్లు నదులు, చెరువుల వద్ద పకడ్బందీ నివారణచర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top