కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

A Father Who Tried To Sexual Assault His Daughter - Sakshi

పోలీసులకు అప్పగింత

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కుమార్తెపైనే లైంగికదాడికి యత్నించిన ఘటన పొర్లుకట్ట జయలలితనగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు నగరంలోని జయలలితనగర్‌లో దంపతులు నివాసం ఉంటునారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు ఆటోమెకానిక్‌ పనులు చేసుకుంటూ పనిచేసే చోటనే ఉంటున్నాడు. రెండో కుమార్తె నగరంలోని ఓ మదరసాలో ఉర్దూ చదువుకుంటూ అక్కడే ఉంటోంది. రంజాన్‌పండగ సందర్భంగా ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. పెద్ద కుమార్తె సైతం డెలివరీ నిమిత్తం పుట్టింటికి వచ్చింది. అందరూ సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వారి అమ్మ కువైట్‌కు వెళ్లడంతో తండ్రితో కలిసి కుమార్తెలు ఇంట్లో ఉంటున్నారు.

వారం రోజుల క్రితం పెద్ద కుమార్తె తన అత్తవారింటికి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి తండ్రి ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న రెండో కుమార్తెపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె అతనిని తప్పించుకుని పడకగదిలోకి వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి పడకగదిలోకి వెళ్లి కత్తితో ఆమెను చంపుతామని బెదిరించి లైంగికదాడికి మరోసారి యత్నించాడు. ఇంతలో పక్కింట్లో ఉన్న ఓ మహిళ తలుపు కొట్టడంతో చిన్నారి అతనిని తప్పించుకుని వెళ్లి తలుపుతీసింది. అనంతరం జరిగిన విషయాన్ని బాధిత బాలిక తన అక్కకు తెలియజేసింది. మంగళవారం ఇద్దరు కుమార్తెలు, స్థానికులు సదరు కామాంధునికి దేహశుద్ధి చేసి సంతపేట పోలీసులకు అప్పగించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు సంతపేట ఇన్‌స్పెక్టర్‌ రాములు నాయక్‌ తండ్రిపై పోక్సోయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top