కన్నతండ్రే కాటేశాడు

Father Molestation On Own Daughter - Sakshi

పదేళ్ల కూతురిపై అత్యాచారం 

తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి...

పెద్దదోర్నాల(ప్రకాశం): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కామంతో కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడేనికి చెందిన పదేళ్ల బాలిక ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో సొంతగూడెం అయిన తుమ్మలబైలులో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. 

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాలిక తల్లి మేకలు కాసేందుకు అడవిలోకి వెళ్లింది. కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రి దాసరి గురవయ్య బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది చూసిన బాలిక తమ్ముడు తల్లి ఇంటికి రాగానే జరిగిన  ఘటనను వివరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి తన భర్త చేసిన నిర్వాకంపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు  నమోదు చేసున్న ఎస్‌ఐ రామకోటయ్య పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. గురవయ్య పోలీసుల అదుపులోనే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top