బైక్‌ను అడ్డగించి యువకుడిపై ఏనుగు దాడి

Elephant Attacks Young Man In Karnataka - Sakshi

మాలూరు: కోలారు జిల్లాలో అడవి ఏనుగులు పొలాల మీద, ఊర్లమీద పడి ప్రజలన భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఏనుగుల దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బుధవారం తాలూకాలోని అరళేరి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. తాలూకాలోని కాటేరి హొన్నళ్లి గ్రామానికి చెందిన రాజప్ప బైక్‌పై గ్రామానికి వెళుతున్న సమయంలో రోడ్డుపైకి వచ్చిన ఏనుగు అతన్ని అడ్డుకుంది. రాజప్పపై దాడి జరిపి తీవ్రంగా గాయపరచడంతో అతని ముఖానికి గాయాలయ్యాయి. అప్పుడే అక్కడికి మరికొంతమంది రావడంతో ఏనుగు వెళ్లిపోయింది. గ్రామస్తులు రాజప్పను అంబులెన్స్‌లో కోలారు జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

నాలుగు రోజుల నుంచి హల్‌చల్‌  
గత నాలుగు రోజుల నుంచి మాలూరు తాలూకాలోని చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేయడమే కాకుండా మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించాల్సి వస్తోంది.విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. ఏనుగులను తమిళనాడు అటవీ ప్రాంతంలోని తరిమేయడానికి గత కొద్ది అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏనుగులను అడవిలోకి తరిమి వేస్తామని భయ పడాల్సి వద్దని అధికారులు గ్రామస్తులకు ధైర్యం చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఏనుగులు దాడి చేస్తాయో, ప్రాణాలు తీస్తాయోనని ప్రజలు, రైతులు భయంభయంతో గడుపుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top